ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ స్వీకరణకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ లైన్ హండ్రెడ్ లేదా వన్ ట్వంటీకి కాల్ చేసిన పది నిమిషాల లోపే బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో వార్డ్ , గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణా తరగతులను గౌతం సవాంగ్ ప్రారంభించారు. మహిళల భద్రత బాధ్యత కూడా మహిళా సంరక్షణ కార్యదర్శులపై ఉందన్నారు. త్వరలో మహిళా కార్యదర్శులకు కరాటే తో పాటు యోగా క్లాసులు నిర్వహిస్తాం అని డీజీపీ వెల్లడించారు.