ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారం: సీఆర్డీఏ కమిషనర్
రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈరోజు "గ్రీవెన్స్ డే" నిర్వహించారు.
అమరావతి: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈరోజు "గ్రీవెన్స్ డే" నిర్వహించారు. వీధి పోట్లు, భవనాల అనుమతులు, వార్షిక కౌలు, గ్రామకంఠాలు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్‌మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను "గ్రీవెన్స్ డే"లో కమిషనర్ కె.కన్నబాబుకి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు.
సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ డేలో అర్జీదారులు తెలియజేసిన పలు ఫిర్యాదులకు, కమిషనర్ ఆదేశాలమేరకు అధికారులు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం వద్దని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే నిర్వహిస్తామన్నారు. అలాగే, రైతుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజూ పనివేళలలో అధికారులు అర్జీలు స్వీకరిస్తారని, రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
గ్రీవెన్స్ డేలో 45 ఫిర్యాదులు వచ్చాయి. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఇవి:
1.అమరావతిలో భూమి వ్యవహారాలు = 31
2. డెవలప్మెంట్ ప్రమోషన్= 6
3. సామాజిక సంక్షేమం= 4
4. ప్లానింగ్= 3
5. ఎస్టేట్స్= 1
గ్రీవెన్స్ డేలో APCRDA చీఫ్ ఇంజినీర్ GV రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.శేషిరెడ్డి, కే.ఎస్.భాగ్యరేఖ, పి. పద్మావతి, ఏ.జి.చిన్ని కృష్ణ, జి. భీమారావు, బి. సాయి శ్రీనివాస నాయక్, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి.డేవిడ్ రాజు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే(LA) ఎస్. రవీంద్ర ప్రసాద్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ జోనల్ జాయింట్ డైరెక్టర్ సి.హెచ్. మధుసూధనరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.