కడప జిల్లాకు రూ.7.5 కోట్ల మంజూరుకు నితిఅయోగ్ ఆమోదం
వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.50 కోట్లు మంజూరుకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.50 కోట్లు మంజూరుకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీలలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతి ని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సవివరంగా వివరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆనంద శేఖర్ అభినందించారు.
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా లో వినూత్నంగా అమలు చేస్తున్న స్టార్ట్ అప్ కడప, స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్,అంగన్వాడీ లలో మౌలిక వసతుల కల్పన,పారిశుద్ధ్య నిర్వహణ కు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సవివరంగా వివరించారు. న్యూఢిల్లీలో శుక్రవారం నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆనంద్ శేఖర్ తో శ్రీధర్ చెరుకూరి సమావేశమై, వైయస్సార్ కడప జిల్లా అభివృద్ధి లో భాగంగా అమలు చేస్తున్న స్టార్ట్ అప్ కడప,స్మార్ట్ కిచెన్,ఆర్గానిక్ మార్కెటింగ్, అంగన్వాడీ లలో మౌలిక వసతుల కల్పన,పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని, ఇతర పథకాల వివరాలను, వాటి ప్రగతిని నీతి ఆయోగ్ ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సందర్భం గా జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ.7.50 కోట్లు మంజూరుకు చేసేందుకు నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు అభినందించారు.. .
జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో వైఎస్ఆర్ కడప జిల్లా
నిరంతర పర్యవేక్షణ, వ్యూహాత్మక ప్రణాళిక, చురుకైన నాయకత్వం ఫలితంగా జాతీయస్థాయిలో వైఎస్ఆర్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ లలో జాతీయస్థాయిలో 73.6 శాతంతో ఈ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వై ఎస్ ఆర్ కడప జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని సాధించడంలో నిబద్ధతతో అంకిత భావం, కృషితో పనిచేసిన మొత్తం కడప జిల్లా అధికార బృందానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అభినందనలు తెలిపారు.