AP Election Results: పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
AP Assembly Election Results 2024: పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ విషయంలో ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
AP Election Results: పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
AP Assembly Election Results 2024: పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ విషయంలో ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం-13ఏపై ఆర్వో సంతకం, స్టాంపు, హోదా వివరాల విషయంలో ఈసీ వాదనలను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పటికే ఈ అంశంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. వైసీపీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. రేపు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తి కలిగిస్తోంది.