AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..హాజరు కానున్న వైసీపీ అధినేత జగన్

Update: 2025-02-24 02:30 GMT

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..హాజరు కానున్న వైసీపీ అధినేత జగన్

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి సమావేశాల్లో ఓ ప్రత్యేకత కనిపించబోతోంది. తాను, తన ఎమ్మెల్యేలూ అసెంబ్లీకి వస్తామాని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు. అంటే సభలో ప్రతిపక్షంగా ఈ పార్టీ ఉండనుంది. కానీ సభలో టీడీపీ తర్వాత 21 ఎమ్మెల్యేలతో రెండో పెద్దపార్టీగా ఉన్న జనసేన తానే అసలైన ప్రతిపక్షంగా ఉంటామంటోంది. తాము ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. దీనిపై నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

కూటమి పార్టీల వ్యూహం చూసినట్లయితే..సభలో ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నా..ఆ పార్టీ అధినేత జగన్ కు మాట్లాడే అవకాశం పెద్దగా ఇవ్వరని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మాట్లాడేందుకు ఎక్కువ స్కోప్ ఉండదు. అందుకే జగన్ మౌనంగా సభలో ఉంటారా లేక ఆందోళనలు చేస్తూ వాకౌట్ చేస్తారా అనేది ఆసక్తిరేపుతున్న అంశంగా మారింది.

మరోకీలక అంశం కూడా ఉంది. సభ్యులు ఎవరూ అసెంబ్లీ సభా ప్రాంగణంలో నినాదాలు చేయరాదు. ప్లకార్డులు చూపించరాదు. పాంప్లెట్లు పంచరాదు. అంతేకాదు అసెంబ్లీ దగ్గర ఊరేగింపులు, ధర్నాలు, నిరసన ర్యాలీలు బైఠాయింపుల వంటివి చేయరాదు. ప్రతిపక్షాన్ని పూర్తిగా కట్టడి చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏం చేసినా జగన్ సభలో ఉండి తీరాలని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు ఇచ్చిన మాండేట్ ను జగన్ శిరసావహించాలంటున్నారు.

ఉదయం 9.30సమయంలో అసెంబ్లీకి నేతలంతా వచ్చేస్తారు. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉదయం 9.53కి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. గౌరవవందనం పొంది..సభలోకి వస్తారు. ఉదయం 10గంటలకు రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉదయం 11.15కి తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడుతుంది. ఈ సమావేశాలు 3 వారాలు జరిగే అవకాశం ఉంది.


Tags:    

Similar News