ఆంధ్రా , తమిళనాడు సరిహద్దుల్లో ఏనుగుల గుంపు బీభత్సం

ఆంధ్రా , తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంత సమీపంలో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Update: 2019-10-28 05:07 GMT

ఆంధ్రా , తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంత సమీపంలో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సులగిరి ప్రాంతంలో సుమారు 12 ఏనుగులు చొరబడటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటల కోతల సమయంలో ఏనుగులు సంచరిస్తుండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.

ప్రతి ఏటా బాన్నేరుఘట్టా అటవీ ప్రాంతం నుండి హోసూరు సమీపంలోని సానామావు అటవీ ప్రాంతానికి అక్టోబర్ నెలలో వందల సంఖ్యలో ఏనుగులు రావడం మూడు నెలల తర్వాత అవి తిరిగి వెళుతుంటాయి. ప్రతిసారి రాగుల పంట కంకిదశకు చేరుకున్న సమయంలో ఏనుగులు రాగి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సోలార్ కంచెను ఏనుగులు దాటుతూ పంటలు నాశనం చేస్తున్నాయి. కర్ణాటక నుంచి తళి అటవీ ప్రాంతానికి వచ్చిన 40 ఏనుగుల మంద నుండి 12 ఏనుగులు విడిపోయి సానామావు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఏనుగులను కర్ణాటక అటవీ ప్రాంతానికి తరిమివేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News