ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఎదగడానికి విశాఖకు ఉన్న అవకాశాలేంటి?

విశాఖ మరో పదేళ్లలో ఆ నగరాలకు దీటుగా ఎదుగుతుందా?ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎదగడానికి విశాఖకు ఉన్న అవకాశాలేంటి? చూద్దాం ఇవాల్టి ఫోకస్

Update: 2020-02-07 13:45 GMT
Visakhapatnam best city

మూడు రాజధానుల ఏర్పాటు తధ్యమని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. అమరావతిని చంపొద్దంటూ విపక్షాలు ఆందోళనల బాట పట్టినా జగన్ ప్రభుత్వం విశాఖే రాజధాని అని తేల్చేసింది. అదే దిశగా అడుగులూ వేసేస్తోంది..ఒక్కక్కటిగా శాఖలనూ తరలించేస్తోంది. విశాఖకు రాజధానికి కావల్సిన అన్ని హంగులూ ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు. మరో పదేళ్లలో ముంబై, బెంగళూరు తరహా నగరాల సరసన విశాఖను చేర్చుతామంటున్నారు. మరి విశాఖ మరో పదేళ్లలో ఆ నగరాలకు దీటుగా ఎదుగుతుందా?ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎదగడానికి విశాఖకు ఉన్న అవకాశాలేంటి? చూద్దాం ఇవాల్టి ఫోకస్

ఎవరేమనుకున్నా విశాఖ పాలనా రాజధాని అని కుండబద్దలు కొట్టేసారు ఏపీ సీఎం.అసలా ఆలోచన తనకెందుకొచ్చిందో.. ఎలా వచ్చిందో కూడా వివరించారు.. కుటుంబం కోసం ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో... ప్రభుత్వ పెద్దగా తాను అలాగే ఆలోచించి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఎంపిక చేశానన్నారు. ఏ రాజధానికైనా మౌలిక వసతులే కీలకం. కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలు, వనరులు, ప్రమాణాలు ఉంటేనే ఆ నగరాన్ని రాజధానిగా ఎంపిక చేయటం ఆనవాయితి.. విభజిత ఏపీకి మరి రాజధాని ఏది? అమరావతి రాష్ట్రానికి మధ్యలో మాత్రమే ఉంది.. కానీ మౌలిక వసతులు మాత్రం లేవు అన్నీ పునాదులనుంచి ఏర్పాటు చేసుకోవాల్సిందే.. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తేనే గానీ అమరావతిలో మౌలిక సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదు అయితే, ఆ లక్ష కోట్లలో 10శాతం ఖర్చుచేస్తే చాలు... వైజాగ్‌ను హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన నిలబెట్టొచ్చన్నది సీఎం జగన్ ఉద్దేశం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ సిటీగా ఉన్న విశాఖలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

కనీస మౌలిక వసతులైన రోడ్స్, వాటర్, పవర్, డ్రైన్స్, రైల్వే ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నారు. ఇప్పుడున్న మౌలిక వసతులకు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఐదేళ్లలో లేదా పదేళ్లలో కచ్చితంగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సరసన వైజాగ్ నిలబడుతుందని, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన ఉండదన్నారు.

హైదరాబాద్ ఇది ఒక రోజులో నగరంగా మారలేదు.. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం.. ఎన్నో ఉత్థాన పతనాలను చూసిన నగరం వాతావరణం అత్యద్భుతం అందుకే ఇక్కడకు అన్ని రకాల ప్రజలూ తరలి వచ్చారు. చారిత్రక ప్రాధాన్యత ఒక ప్లస్ పాయింట్ అయితే..పెట్టుబడులకు స్వర్గ ధామం. హైదరాబాద్ 25 ఏళ్లలో శరవేగంగా రూపు రేఖలు మార్చుకుంది.. అందుకు కారణం ఇక్కడ మౌలిక వసతులు ఐటీ రంగం హైదరాబాద్ కు మరో ఆభరణం. పరిశ్రమలు కూడా రాను రాను పెరుగుతూ వచ్చాయి.

దాంతో ఉద్యోగాల కల్పతరువుగా హైదరాబాద్ మారిపోయింది. నగర విస్తరణకు అపారమైన స్థలం, అవకాశాలు,ఉన్నాయి. ఇక హైదరాబాద్ తో పోల్చుకుంటే విశాఖ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది.. అక్కడా పరిశ్రమలున్నాయి.. అక్కడా సాఫ్ట్ వేర్ విస్తరిస్తోంది. విస్తారమైన భూములున్నాయి.అన్ని మౌలిక వసతులూ ఉన్నాయి. వాణిజ్య విస్తరణకు సముద్ర తీరం ఒక ప్లస్ పాయింట్... ఈ అవకాశాల వల్ల విశాఖను అభివృద్ధి చేయడం సులభమంటున్నారు జగన్.

ఇక బెంగళూరు విషయానికొద్దాం.. దేశంలోనే బెంగళూరుకు మంచి పేరుంది. ముఖ్యంగా బెంగళూరు అభివృద్ధిలో ఐటీ రంగానిదే ప్రధాన పాత్ర.... దేశంలోనే అత్యధిక ఐటీ కంపెనీలు బెంగళూరులో ఉన్నాయి. ప్రపంచ ప్ర‎ఖ్యాతి గాంచిన ఐటీ కంపెలన్నీ బెంగళూరులోనే కొలువుదీరాయి. అంతేకాదు ఏ విదేశీ కంపెనీ ఇండియా వచ్చినా వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ బెంగళూరే అందుకే, బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది. అందుకే, యువత ఉద్యోగాల కోసం మొదట చూసే నగరం బెంగళూరే... అయితే, వైజాగ్‌ను బెంగళూరు స్థాయికి తీసుకొస్తామన్న జగన్మోహన్ రెడ్డి. ఐటీని పెద్దఎత్తున ప్రోత్రహించే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మోస్ట్ లవబుల్ సిటీగా బెంగళూరుకు పేరుంది.

ముఖ్యంగా బెంగళూరు ప్లాన్డ్ సిటీ అంటారు. ఎందుకంటే, బెస్ట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ బెంగళూరు సొంతం. అన్నింటికీ మించి బెంగళూరులో బ్యూటీఫుల్ వెదర్ ఉంటుంది... అందుకే, బెంగళూరును లండన్‌ సిటీతో పోల్చుతారు. అంతేకాదు, చెన్నై, ముంబై మాదిరిగా బీచ్‌లు లేకపోయినా... ప్రతి వీధి చివరన కచ్చితంగా ఒక పార్కు తప్పనిసరిగా ఉంటుంది... వీటన్నింటినీ మించి పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ బెంగళూరు సిటీ సొంతం... ఇక, రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించినందున బెంగళూరు ఎదిగిన తీరును దగ్గర నుంచి చూసిన అనుభంతోనే జగన్ విశాఖను బెంగళూరుతో సమానంగా అభివృద్ధి చేస్తానంటున్నారా?

మెట్రో నగరాల్లో ప్రముఖంగా చెప్పుకోదగినది చెన్నై.. వైజాగ్ మాదిరిగా సీ కోస్ట్ ఉండే చెన్నై నగరం... దేశంలోనే టాప్ మోస్ట్‌ ఫైవ్ సిటీస్‌లో ఒకటిగా ఎదిగింది.... ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో చెన్నై ముందు కనిపిస్తుంది... దేశ విదేశీ కంపెనీలెన్నో చెన్నైలో కొలువుదీరాయి.... చెన్నై కూడా ఐటీ రంగంలో బాగానే ఎదిగింది. చెన్నై మాదిరిగానే విశాఖలో కూడా పరిశ్రమలు రానున్న కాలంలో మరింతగా విస్తరించి అభివృద్ధి చెందే ఆస్కారముంది..అందుకు రాజధానిగా ఆ నగరం మారడం ఎంతో అవసరమన్నది ఏపీ సీఎం ఉద్దేశంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ సిటీగా ఉన్న విశాఖ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.... అభివృద్ధి చేస్తే అతి తక్కువ కాలంలోనే దేశంలోనే టాప్ ఫైవ్ మెట్రో సిటీస్‌లో ఒక్కటిగా అవతరించే అవకాశాలు మొండుగా ఉన్నాయి... ఎందుకంటే, సహజ వనరులతో దేశంలో ఏ నగరానికీ లేని ఎన్నో పాజిటివ్ పాయింట్స్‌ విశాఖకు కనిపిస్తున్నాయి....

ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... వందలకొలది ప్రత్యేకతలు విశాఖ సొంతం.... ముఖ్యంగా విశాఖకు మెయిన్ అస్సెట్... సీ కోస్ట్.... సముద్ర తీరం వెంబడి ‎మహానగరంగా రూపాంతరం చెందిన వైజాగ్‌లో సహజసిద్ధ అందాలెన్నో కనిపిస్తాయి.... అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కంటే ముందుగా గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం విశాఖ.... అలాగే, దేశంలోనే అతిపెద్ద నాలుగో ఓడరేవు కలిగిన నగరం వైజాగ్‌.... అంతేకాదు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది.... స్వతంత్ర భారత దేశపు మొట్టమొదటి ఓడ జల ఉష ఇక్కడే నిర్మించబడింది... ఇక, సుందరమైన సముద్ర తీరం... ఆహ్లాదకరమైన వాతావరణం... అద్భుతమైన కొండ లోయలు... మన్యం సౌందర్యం.... ఇలా చెప్పుకుంటూ పోతే.... ఇలా ఎన్నో ప్రత్యేకతలు వైజాగ్‌కి ఉన్నాయి....

బహుశా ఈకారణాల వల్లనే ఏపీ సీఎం జగన్ విశాఖను తన పాలనా రాజధానిగా ఎంచుకున్నారా? ఏమీ లేని చోట లక్షకోట్లు ఖర్చు పెట్టి.. ఒక కృత్రిమ నగరాన్ని నిర్మించడం కన్నా.. అన్ని వసతులు ఉన్న నగరానికి కాస్త ఊతమిచ్చి అందమైన రాజధానిగా రూపు దిద్దుకోవచ్చని పెట్టుబడులకు విశాఖ అనుకూలమైన నగరమనీ జగన్ అంటున్నారు.

హైదరాబాద్ లా విశాఖ కూడా మినీ ఇండియాను తలపిస్తుంది.. అక్కడా పరిశ్రమల విస్తరణ కారణంగా పొరుగు రాష్ట్రాల వారూ వలస వచ్చారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం రాజధానికోసం పునాదుల నుంచి నిర్మించి అప్పుల పాలవడం కన్నా.. అందులో పదిశాతం ఖర్చు చేసి అందుబాటులో ఉన్న వాటితో అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చని వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు అమలుచేస్తోంది. చూద్దాం.. భవిష్యత్తులో విశాఖ ప్రపంచ నగరాల సరసన చోటు దక్కించుకుంటుందని ఆశిద్దాం.. 

 

Tags:    

Similar News