కృష్ణపట్నం పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు.. 1700 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
మండలం కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని, విజిలెన్స్ అధికారులు గురించారు.
ముత్తుకూరు: మండలం కృష్ణపట్నం పోర్టులో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని, విజిలెన్స్ అధికారులు గురించారు. ఈ రేషన్ బియ్యం విలువ ఐదున్నర కోట్ల గా అధికారులు నిర్ధారణ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ఈ దాడులకు విజిలెన్స్ ఎస్పీ శ్రీదర్ నేతృత్వం వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 1700 టన్నుల బియ్యం తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయని, చివరి నిమిషంలో అధికారులు ఒమ్ము చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఓఎస్డి వెంకట్ నాధ్ రెడ్డి, సీఐ మాణిక్యరావు సివిల్ అండ్ కస్టమ్స్ అధికారులు పాల్గొన్నారు.