Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల

Prakasam Barrage: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా నీరు వచ్చింది.

Update: 2021-07-02 13:53 GMT

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల

Prakasam Barrage: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా నీరు వచ్చింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వంద శాతం కెపాసిటీతో నిండుకుండలా మారింది. దీంతో అలెర్ట్ అయిన అధికారులు బ్యారేజీ 20 గేట్లు ఎత్తి 8 వేల 500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నాలుగు రోజులుగా పులిచింతలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు చెప్పిన తెలంగాణ పట్టించుకోవడం లేదు. మరోవైపు తెలంగాణ నీటి వినియోగంపై ప్రధాని మోడీకి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతి పత్రం కూడా అందించారు. అయినా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ‌ఖాళీ అవుతున్నాయి. దీనిపై ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది.

విజయవాడ ప్రకాశం బ్యారేజీ 20 గేట్లు ఎత్తి 8 వేల 500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశామని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వరూప్ తెలిపారు. తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కారణంగా ప్రకాశం బ్యారేజికి నీరు చేరుకోవడంతో గేట్లు ఎత్తమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే తప్ప సముద్రంలోకి నీటిని విడుదల చెయ్యడం ఆపలేమన్నారు. 

Tags:    

Similar News