AP Assembly: ఏపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
AP Assembly Sessions 2024: నేటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలకు శిక్షణాతరగతులను నిర్వహించనున్నారు.
AP Assembly: ఏపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
AP Assembly Sessions 2024: నేటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలకు శిక్షణాతరగతులను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశ భవనంలో ఇవాళ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత సభలో మొదటి సారిగా ఎన్నికైన సభ్యులే అధికంగా ఉండటంతో సభలో హుందాగా ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా సభా సంప్రదాయాలను సీఎం చంద్రబాబు ఎమ్మేల్యేలకు వివరిస్తారు. మిగిలిన సీనియర్ సభ్యులతో ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాల గురించి స్పీకర్, అసెంబ్లీ అధికారులు వివరిస్తారు.
సభలో నిత్యం వ్యవరించే శాసనసభ భాష, వ్యవరించే తీరు.. సభలో జరిగే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. కొశ్చన్ అవర్ అంటే ఏంటి..? జీరో హవర్.. పాయింట్ ఆఫ్ ఆర్థర్ అంటే ఏంటి అనే అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తారు. సభలో జరిగే కీలకమైన చర్చల్లో ఎలా పాల్గొనాలి...ఎలా ప్రిపేర్ అవ్వాలి...? డిమాండ్స్...అంటే ఏమిటి.. బిల్లులు పద్దులు. చట్ట సవరణ.. అంటే ఏమిటి .... శాసన సభ లో సభ్యునికి ఉండే హక్కులు...జీత భత్యాలు అన్ని స్పీకర్ తోపాటు అధికారులు వివరించనున్నారు.