నేడు జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్..!

Janasena: ఇప్పటికే 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్‌

Update: 2024-03-14 04:15 GMT

నేడు జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్..!

Janasena: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ జనసేన పార్టీ తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 15 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకులతో పార్టీ అధినేత చర్చలు జరిపారు.

ఎన్నికల నియమావళి, నామినేషన్‌ దాఖలు నుంచి పోలింగ్‌ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను అందజేశారు. ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగాముందుకువెళ్లాలని... టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పవన్ కల్యాణ్‌ దిశానిర్ధేశం చేశారు.

Tags:    

Similar News