Sarvepalli: మత్స్యకారుల కోసం సోమిరెడ్డి కీలక నిర్ణయం అక్రమ వేటపై ఉక్కుపాదం!

Sarvepalli: మత్స్యకారుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2026-04-04 13:50 GMT

Sarvepalli: మత్స్యకారుల కోసం సోమిరెడ్డి కీలక నిర్ణయం అక్రమ వేటపై ఉక్కుపాదం!

Sarvepalli: అక్రమ వేట నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని, సముద్రంలో గస్తీకి నాలుగు హైస్పీడ్ బోట్ల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.

నేలటూరు పిషింగ్ జెట్టీ పనులు పూర్తి చేయడంతో పాటు పులికాట్ లో పూడికతీతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్, కలెక్టర్, పోలీసు అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో 10 రోజులుగా మన మత్స్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

జువ్వలదిన్నె నుంచి తీసుకెళ్లిన నాలుగు బోట్లను పుదుచ్చేరి లో అధికారులు సీజ్ చేశారని, పులికాట్ లో సముద్రముఖ ద్వారాల పూడిక తీతకు ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మరో రూ.100 కోట్ల మంజూరుకు సంబంధించి కూడా సీఎం డైరెక్షన్ ఇచ్చారని చెప్పారు. 164 గ్రామాల మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Tags:    

Similar News