Madakshira: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును తొలగించాలని డిమాండ్!

Madakshira: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మడకశిరలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

Update: 2026-04-04 12:12 GMT

Madakshira: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును తొలగించాలని డిమాండ్!

Madakshira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి ప్రాంత ప్రజల శాంతి, సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవల్లో పాల్గొన్నారు.

పూజల అనంతరం ఈరలక్కప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు పై వస్తున్న లైంగిక ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్ర సంస్థకు ఉన్న గౌరవం, విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలంటే వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కీలక పదవిలో కొనసాగడం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు.

అంతేకాకుండా, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భక్తుల విశ్వాసం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ధార్మిక సంస్థల ప్రతిష్టను కాపాడటంలో ఎలాంటి రాజీ పడబోమని ఈరలక్కప్ప తెలిపారు.

Tags:    

Similar News