Pithapuram: రైతులకు వెన్నుదన్నుగా జనసేన.. పిఠాపురంలో రిజిస్ట్రేషన్ల పండగ

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో ఎస్ఈజెడ్ (SEZ) భూముల బాధితులకు ఊరట లభిస్తోంది.

Update: 2026-04-04 10:31 GMT

Pithapuram: రైతులకు వెన్నుదన్నుగా జనసేన.. పిఠాపురంలో రిజిస్ట్రేషన్ల పండగ

Pithapuram: పిఠాపురం నియోజవర్గం యు.కొత్తపళ్లి మండలం కోన పాపాపేట ప్రాంతంలో యు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ ఎస్ ఈ జెడ్ భూముల రైతుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పత్రిక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి మండలం ఇంచార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చే భూములను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటికే ప్రారంభమైందని ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, 80 మంది రైతులు పైన లబ్ది పొందుతున్నారని, అభివృద్ధి ఏదైనా ఉందంటే జరుగుతుందని ప్రభుత్వం అన్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రైతులకు కొన్ని సమస్యలు వస్తున్నాయని హద్దులలో లోటుపాట్లు ఏర్పడుతున్నాయని అవి ఎన్ని ఉన్నాయో అన్నిటిని ఒక లెటర్ పై పొందుపరిచి పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తామని అన్నారు.

అనంతరం జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ మొదటి నుండి రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని దాని నిరూపిస్తూనే ఎస్ ఈ జెడ్ భూములు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, మరి కొన్ని రోజుల్లో అందరి రైతులకు న్యాయం జరుగుతుందని అందుకే ప్రజలను పవన్ కళ్యాణ్ ను ముందుండి నడిపిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్,యు.కొత్తపల్లి మండలం వైస్ ఇంచార్జ్ దొడ్డి దుర్గాప్రసాద్,తెలగంశెట్టి వెంకటేశ్వరరావు,గంటా విజయ్ కుమార్,సూరాడ నాగేశ్వరరావు, సూరాడ ఎల్లాజీ,బాపన దొర, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎస్ఈజడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News