Srikakulam: ఆలయంలో పోలీసుల ఆంక్షలు.. బయట వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
Srikakulam: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైఖరిని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా మందసలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Srikakulam: ఆలయంలో పోలీసుల ఆంక్షలు.. బయట వైఎస్సార్‌సీపీ నేతల ధర్నా
Srikakulam: టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడికి బుద్ధి ప్రసాదించమంటూ పెద్దఎత్తున వైఎస్సార్సీపి నాయకులు మందస వాసుదేవ్ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వై.యెస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు రాష్ట్రమాజీమంత్రి డా.సీదిరి అప్పలరాజు పిలుపుతో శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ్ పెరుమాళ్ ఆలయానికి ర్యాలీ గా చేరుకున్న పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రత్యేక పూజలు అనంతరం వైఎస్సార్సీపీ నాయకులను మందస పోలీసులు ఆలయం లోపల ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని, బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశించారు.
ఆలయం బయట మీడియాతో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ..
టిటిడి చైర్మన్ గా ఉండి పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసారని పలువురు ఆరోపించారు. సనాతనధర్మాన్ని కాపాడుతాం అనిచెప్పుకునే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపవిత్రానికి పాల్పడిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడిపై చర్యలేవని వారు ప్రశ్నించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వై.వైఎస్సార్సీపీ నాయకులు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.