Nellore: భక్తులకు ఇబ్బంది కలగొద్దు.. గిరిధర్ రెడ్డి కీలక ఆదేశాలు

Nellore: నెల్లూరు రూరల్ నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది.

Update: 2026-04-04 13:21 GMT

Nellore: భక్తులకు ఇబ్బంది కలగొద్దు.. గిరిధర్ రెడ్డి కీలక ఆదేశాలు

Nellore: నెల్లూరు రూరల్ నరసింహకొండ వద్ద వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 వతేదీ నుండి మే – 6 వతేదీ వరకు నిర్వహించనున్న నేపధ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగా కుండా నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి అనుషా, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం నరసింహ కొండలోని సమావేశ హాలులో బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..

గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణ సమయములో వచ్చిన లోటుపాట్లను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండా కాలం ద్రష్ట్యా వేసవి తాపం తగలకుండా చలువ పందిళ్ళు, మంచినీరు, ఓ.ఆర్.యస్ ప్యాకెట్లు , మజ్జిగ అందచేశాల చర్యలు తీసుకోవాలాన్నారు. క్యూ లైన్లు క్రమ పద్దతిలో భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా ఏర్పాటుచేయాలన్నారు. నిరంతర విధ్యుత్ సరఫరా చేసేలా అవసరమైన చోట ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రధమ చికిత్సా కేంద్రాలు, అత్యవసర మందులు, అంబులెన్సు లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా పారిశుద్ద్యపనులు చేపట్టాలని సంబంధిత పంచాయతి అధికారులకు సూచించారు. ఆలయ చైర్మన్ అచ్యుత శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ సిబ్బంది, ధర్మకర్తల మండలి సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలును విజయవంతం అందరు కృషి చేయాలన్నారు. క్యూ లైన్లు పకడ్బందిగా నిర్వహించాలన్నారు.

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణను దృష్టిలో పెట్టుకొని అనందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గోపి మాట్లాడుతూ. బ్రహ్మోత్సవాలు నిర్వహణకు తీసుకొన్న ఏర్పాట్ల గురించి వివరించారు. చలువ పందిళ్ళు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు , క్యూ లైన్ల ఏర్పాటు తదితరములు గురించి వివరించారు. ఈ కార్యక్రమములో వివిధ శాఖ అధికారులు, ఆలయ ధర్మ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News