YV Subbareddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తున్న సిట్‌

YV Subbareddy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది.

Update: 2025-11-20 10:10 GMT

YV Subbareddy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోంది.

కల్తీ నెయ్యి ఘటనలో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవోను సిట్ విచారించింది. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ స్టేట్‌మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News