Janasena MLA : సినిమా రేంజ్ ట్విస్టులు.. ఎమ్మెల్యే గారు బ్లేడ్‌తో కోసుకున్నారట..ఏంది సామీ ఈ రచ్చ?
సినిమా రేంజ్ ట్విస్టులు.. ఎమ్మెల్యే గారు బ్లేడ్‌తో కోసుకున్నారట..ఏంది సామీ ఈ రచ్చ?
Janasena MLA : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక షాకింగ్ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదం ముదురుతోంది. ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారనే ఆరోపణలతో మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు సెల్ఫ్ హార్మ్ (ఆత్మహత్యాయత్నం వంటి చర్య) వీడియో కాల్ వరకు వెళ్లింది. ఎమ్మెల్యే తన ప్రేమను నిరూపించుకోవడానికి బ్లేడ్‌తో చేయి కోసుకున్న దృశ్యాలు బయటకు రావడం సంచలనంగా మారింది.
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే లైంగికంగా వేధించడమే కాకుండా, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఐదుసార్లు అబార్షన్ చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్‌లు, గతంలో చేసిన వీడియో కాల్స్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఇప్పటికే మీడియాకు విడుదల చేశారు. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జనసేన అధిష్టానం తక్షణమే స్పందించి ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే విచారణ కొనసాగుతుండగానే, ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన వీడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సదరు మహిళకు మళ్లీ వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కాల్‌లో ఆయన ఎంతో భావోద్వేగానికి లోనవుతూ.. తన ప్రేమను గుర్తించాలని ఆమెను వేడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా, కారులో కూర్చున్న ఎమ్మెల్యే.. తన ప్రేమకు నిరూపణగా బ్లేడ్‌తో చేయి కోసుకుని, రక్తం కారుతున్న దృశ్యాలను ఆమెకు చూపించడం కలకలం రేపింది. ఈ వీడియోలో ఆయన ఏడుస్తూ మాట్లాడటం చూసి రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
బాధితురాలు ఈ వీడియోను కూడా సాక్ష్యంగా బయటపెట్టడంతో ఎమ్మెల్యే శ్రీధర్ పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఇలా భావోద్వేగ ఒత్తిడికి లోనై సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం, మహిళలపై వేధింపులకు పాల్పడటం వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన పార్టీ వేసిన విచారణ కమిటీ ఈ తాజా వీడియోను కూడా కీలక ఆధారంగా పరిగణనలోకి తీసుకోనుంది.
ఈ మొత్తం వ్యవహారంపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కఠినంగా ఉన్నట్లు సమాచారం. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టం చేసిన పవన్, ఈ విచారణ నివేదిక రాగానే ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాధితురాలి ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి కూడా బహిష్కరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా వీడియోతో ఈ కేసులో పోలీసులు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.