Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు.

Update: 2025-09-12 05:42 GMT

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం 

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండి ఉన్నారు. ఆలయం నుంచి శిలాతోరణం వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచిఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

స్లాట్‌ టోకెన్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడితే.. టోకెన్ లేని భక్తులకు దాదాపు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు సైతం 3 నుంచి 4 గంటలు పడుతోంది. దీంతో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్ధేశించిన సమయానికి క్యూ లైన్‌లో వెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.

Tags:    

Similar News