Udayagiri: విద్యుత్తు ఫీజులు తొలగించి... సీసీ కెమెరాలకు ముసుగు వేసి
: పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఉన్న కామాక్షి హోటల్లో, ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 50 వేలు నగదు అపహరణకు గురైనట్లు హోటల్ నిర్వాహకుడు మిట్టపల్లి శ్రీనివాసులు తెలిపారు.
ఉదయగిరి: పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఉన్న కామాక్షి హోటల్లో, ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 50 వేలు నగదు అపహరణకు గురైనట్లు హోటల్ నిర్వాహకుడు మిట్టపల్లి శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు, ఆదివారం రాత్రి హోటల్ పై నుండి డోర్ తెరుచుకుని లోనికి చొరబడిన దుండగుడు ముందుగా, విద్యుత్తు ఫీజులు తొలగించి సీసీ కెమెరాలకు ముసుగు వేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 50 వేల రూపాయలు నగదును అపహరించుకుని పోయారని తెలిపారు.
యధావిధిగా సోమవారం ఉదయం హోటల్ షట్టర్ తెరవగా చోరీ జరిగినట్లు క్యాష్ బాక్స్ పగలగొట్టినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామని హోటల్ యజమాని వాపోయారు.