CM KCR Donate : ఏపీలోని ఆలయ నిర్మాణానికి కేసీఆర్ విరాళం
CM KCR Donate : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట
kcr donate money to nellore temple
CM KCR Donate : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ దంపతులు విరాళం ప్రకటించారు. ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళమిచ్చారు. శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు జరిగాయి..
ఈ వేడుకలకి కేసీఆర్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల వలన వారు హాజరు కాలేకపోయారు. అయితే అలయ నిర్వాహకులు కేసీఆర్ దంపతుల పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు. ఇక తమ గ్రామంలో ఆలయ నిర్మానానికి కేసీఆర్ దంపతులు విరాళం ఇవ్వడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతితో పాటు విజయవాడ కనకదుర్గ అమ్వవారికి మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా అయన నెల్లూరు జిల్లాలో ఆలయ నిర్మాణానికి విరాళం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.