సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. బాబుపై కోపంతో ఇప్పుడు అమరావతిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజధానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత 6 నెలల్లో 22 మంది వైసీపీ ఎంపీలు రాష్ర్ట అభివృద్ధి కోసం ఏం పోరాటం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో పలు హామీలిచ్చి ఇంత వరకు ఏమీ సాధించకపోవడం వైసీపీ ఎంపీల వైఫల్యమన్నారు.