రేపు ఏపీలో నిరసనలకు టీడీపీ పిలుపు.. 3 గంటలుగా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు
TDP Calls Bandh: విజయవాడ సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది.
రేపు ఏపీలో నిరసనలకు టీడీపీ పిలుపు.. 3 గంటలుగా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు
TDP Calls Bandh: విజయవాడ సీఐడీ కార్యాలయంలో చంద్రబాబు విచారణ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా చంద్రబాబును విచారిస్తున్నారు దర్యాప్తు అధికారులు. మరోవైపు కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన నారా భువనేశ్వరి, లోకేష్ ను లోపలికి అనుమతిచ్చారు పోలీసులు. చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫర్మిషన్ ఇచ్చారు.
ఇక చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది టీడీపీ. కక్షపూరితంగా అరెస్టు చేశారంటూ.. రేపు ఏపీ వ్యాప్తంగా సామూహిక దీక్షలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు ఘటనను.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం కలవనుంది.