చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన రజనీకాంత్
Chandrababu: తలైవాతో భేటీ కావడం ఆనందంగా ఉంది
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన రజనీకాంత్
Chandrababu: సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విట్టర్‌లో షేర్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజనీకాంత్‌ను కలిసి ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ఫొటో వేల లైక్స్, రీట్వీట్‌లతో వైరల్‌గా మారింది. చంద్రబాబు-రజనీకాంత్ భేటీలో.. కుశల ప్రశ్నలతో పాటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు, అలాగే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలన్నీ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన చంద్రబాబు తాజాగా రజనీకాంత్‌తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.