Anakapalle: పాయకరావుపేటలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ, విద్యార్థిని మృతి

Anakapalle: బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ప్రమాదంలో గాయాలు

Update: 2023-09-14 08:36 GMT

Anakapalle: పాయకరావుపేటలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ, విద్యార్థిని మృతి

Anakapalle: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ ఎదురుగా రోడ్డుప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బైకును లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని హరిణి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News