నాయకులంతా కమిటీల నియామకంపై దృష్టి పెట్టండి: సజ్జల
వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలన్నారు. అందరూ ఫోకస్‌తో పనిచేయాలని చెప్పారు.
తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలన్నారు. అందరూ ఫోకస్‌తో పనిచేయాలని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
‘‘పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని మన నాయకుడు జగన్ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని అధినేత జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి. డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి. డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్ లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్దం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్ ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు.’’ అని సజ్జల చెప్పారు.
సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి
కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నామని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయిని తెలిపారు. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయన్నారు. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని, ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించారు. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుందని చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే, పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చని సజ్జల అన్నారు.