అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకున్నారు.

Update: 2025-12-28 08:54 GMT

అయోధ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ నిర్వాహకులు చంద్రబాబు నాయుడుని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. అంతకు ముందు, అయోధ్య చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి యూపీ, అయోధ్య దేవాలయ అధికారులు స్వాగతం పలికారు.

‘‘ ఈ రోజు, అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీ రామ జన్మభూమి మందిరంలో దర్శనం చేసుకొని, ప్రార్థనలు చేసే భాగ్యం నాకు లభించింది. ఇక్కడ ఉండటం ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభవం. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తిని ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News