నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏంటి?: ప్రకాష్ రాజ్
నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏంటి? అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. వాళ్లు కూడా మన ప్రజలే కదా? అని అన్నారు.
విశాఖపట్నం: నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏంటి? అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. వాళ్లు కూడా మన ప్రజలే కదా? అని అన్నారు. ‘‘మీ సమస్యలు ఏంటి? జనజీవన స్రవంతిలో కలిసిపోండి’’ అని మాట్లాడాలి కానీ చంపడం ఏంటి? అని అడిగారు. ఇది ఏమైనా ఆపరేషన్ సిందూరాపై గొంతు విప్పి మాట్లాడితే ఈడీ దాడులు చేయడం ఏంటి? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్‌లో ఈ రోజు శ్రామిక ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మావోయిస్టులు మనవాళ్లే కదా హంతకులు కాదు, టెర్రరిస్టులు కాదు, చంపడం ఏమాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జనజీవన స్రవంతిలో కలపాల్సింది పోయి హత్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
శివాజీ మాటలను నేను వ్యతిరేకిస్తున్నాను
సినీ నటుడు శివాజీ మాటలను తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పారు. తన మద్దతు అనసూయకే అన్నారు. శివాజీ మాత్రమే కాదు ఎవరైనా మహిళలను కించపరచడం సరికాదని చెప్పారు. అతని మాటల్లో అవయవాలు మాత్రమే అతనికి కనిపించినట్టు ఉన్నాయన్నారు.
ప్రభుత్వాలు విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. కేరళ ఫైల్స్ మరొక ఫైల్స్ ఏ సినిమా చూసిన హిందూ ముస్లిం ఇదే అంశం తీస్తుంది ఆ మహా నాయకుడే కదా అన్నారు.
నా పోరాటం ఆగదు
బీజేపీని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్‌తో మనం పోరాటం చేయాలన్నారు. మనం లేకపోయినా ఏదో ఒక రోజు కూకటి వేళ్లతో సైతం ఆర్ఎస్ఎస్‌ను పేకలిస్తారని హెచ్చరించారు. తాను సాంస్కృతికంగా ఆర్ఎస్ఎస్‌పై పోరాటం చేస్తానని చెప్పారు. భారతదేశంలో కనిపించని బ్రహ్మ రాక్షసుడు ఉన్నారని విమర్శించారు. కమలం పార్టీతో తాను పోరాడుతున్నానని.. తన పోరాటం ఆగదన్నారు. సీఐటీయూకి తనకు అనుబంధం చాలా ఏళ్ల నుంచి ఉందని గుర్తుచేసుకున్నారు. వీధి నాటకాల నుంచే తన ప్రయాణం ప్రారంభమైందని ప్రస్తావించారు. అబద్ధం మాట్లాడటానికి ధైర్యం ఉండాలని, నిజం మాట్లాడటానికి కాదని చెప్పారు.కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు. విశాఖపట్నంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వాలు అమ్ముడు పోయాయని ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేశారు.