AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. అసెంబ్లీ గేటు వద్ద జగన్ నిరసన
AP Assembly: ఏపీ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేశారు. సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలన్నారు.
వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యలోనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ముందు వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా తమను గుర్తింపు ఇవ్వడం లేదని.. అలాగే శాంతి భద్రతలపై నిలదీయనివ్వడం లేదని ఆందోళన చేశారు.