Nellore: నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి జాతర
Nellore: నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. 15, 46 డివిజన్లలో రూ. 58 లక్షల వ్యయంతో డ్రైన్లు, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
Nellore: నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి జాతర
Nellore: నెల్లూరు సిటీ 15 వ డివిజన్ బాలాజీనగర్ ఉగాది సెంటర్ లో 30 లక్షలతో డ్రైన్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు మంత్రి నారాయణ. 46 వ డివిజన్ రాధామాధవ్ సందులో 28 లక్షలతో సీసీ రోడ్డు ,డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ట్రంక్ రోడ్డులో దుకాణ దారులను పలకరిస్తూ సందడి చేశారు మంత్రి నారాయణ. 9 వ డివిజన్ లోని మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించి, అత్యాధునిక హంగులతో నూతన మార్కెట్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలిచ్చారు. వెళ్లిన ప్రతిచోటా, స్థానికులు స్థానికులు, టిడిపి నేతలు అభివృద్ధి ప్రదాతకు బ్రహ్మరధం పట్టారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..
అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతోందని,అభివృద్ధి,సంక్షేమానికి సీఎం సమ ప్రాధ్యాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం పాలన చేతకాక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని గుర్తు చేశారు. కోట్ల రూపాయల కేంద్రనిధులను దారి మళ్లించిందని, దూర దృష్టితో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని చెప్పారు.
పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని , దేశంలోనే 25 శాతం పెట్టుబడులను రాష్టానికి రాబట్టగలిగారని, సీఎం చంద్రబాబు నాయుడి పరిపాలనానుభవంతో రాష్ట్ర పరిస్థితి కుదుటపడుతోందని చెప్పారు .రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు మంత్రి నారాయణ.
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,మేయర్ సుజాతా అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు ,కర్తం ప్రతాప్ రెడ్డి ,క్లస్టర్లు ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ ,బాలాజీ ,కో క్లస్టర్లు అంచూరు శ్రీనివాసులు ,పుట్టా అజయ్ ,డివిజన్ ప్రెసిడెంట్లు పెంచల్ చౌదరి , మహేంద్ర ,పాకాల పెంచలయ్య ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి తదితరులు పాల్గొన్నారు.