CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ.. శివస్వాములపై లాఠీఛార్జ్ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
CM Chandrababu: శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ.. శివస్వాములపై లాఠీఛార్జ్ వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి మంత్రులు, సీఎస్, డీజీపీలతో రివ్యూ చేశారు. జిల్లా అధికారులు శ్రీశైల క్షేత్రంలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. మంత్రులు ఆనం, అనిత భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులకు వసతి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దీక్షలు వేసుకుని... కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులను అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించొద్దని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. శివరాత్రికి ఇబ్బందులు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.