Nellore: మట్టి రోడ్డు వేయలేని వారు.. మత్స్యకారుల గురించి మాట్లాడతారా?

Nellore: వైసీపీ ఐదేళ్ల పాలనలో మత్స్యకారులకు జరిగిన లబ్ధి ఏంటో చెప్పాలని బీద రవిచంద్ర డిమాండ్ చేశారు.

Update: 2026-03-28 15:15 GMT

Nellore: మట్టి రోడ్డు వేయలేని వారు.. మత్స్యకారుల గురించి మాట్లాడతారా?

Nellore: వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒక్క వల కానీ, ఒక్క తెప్ప కానీ....కనీసం లక్ష రూపాయల స్కీమ్ కానీ ఇచ్చినట్టు చెప్పగలరా ? వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు , నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర.

మత్స్యకారుల ప్రయోజనాల కోసం 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాతే జువ్వలదిన్నెకు రావాలి అని చెప్పారు. జువ్వలదిన్నె హార్బర్ కు కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేకపోయిన కాకాణి గోవర్థన్ రెడ్డి (ఆనాటి మంత్రి), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లకు మత్స్యకారుల సమస్యలపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మత్స్యకారులకు చిన్న ఇబ్బంది ఏర్పడినా, వారి ప్రయోజనాలకు భంగం కలిగినా , కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డితో కలిసి అండగా నిలబడతానని అన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమని చెప్పారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన అడ్డగోలు జీవో లను తొలగించి 2 జిల్లాలకు ఫిషింగ్ హార్బర్ ను, రామాయపట్నం పోర్టుని అందించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. నెల్లూరు జిల్లా లో ఫిషింగ్ హార్బర్ ఏర్పడడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అని అన్నారు.

జగన్ ప్రయోజనాల కోసం ముత్తుకూరు కృష్ణపట్నం నుండి ఓడరేవు(వాన్ పిక్) వరకు ఏ నిర్మాణం రాకుండా దుర్మార్గమైన జీవో విడుదల చేసిన చరిత్ర వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ది, జగన్మోహన్ రెడ్డి ది అని గుర్తు చేశారు.

1 కి.మీ. సముద్రం కూడా లేని తెలంగాణ రాష్ట్రం 978 కోట్ల ఎన్.సి.డి.సి. కేంద్ర నిధులను ఖర్చు చేస్తే, సుదూర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రూపాయి వాడుకోలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

సాగర్ డిఫెన్స్ భారతదేశ ప్రయోజనాలు, రక్షణ రంగ, నావికాదళం ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిందని, టెక్నాలజీ మాత్రమే ప్రైవేటు వ్యక్తులదని, దానిని నారా లోకేష్ ప్రైవేటుపరం చేస్తున్నారనే ప్రచారం అర్థ రహితం అని చెప్పారు.

25% పెట్టుబడులను సాధించి దేశ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడు నారా లోకేష్ అని... ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం శ్రమిస్తున్న నారా లోకేష్ పై దుష్ప్రచారం సిగ్గుచేటు అని అన్నారు బీద రవిచంద్ర.

Tags:    

Similar News