Nellore: మంత్రి ఆనం చొరవ చేజర్ల మండల ప్రజలకు తీరనున్న బస్సు కష్టాలు!
Nellore: నెల్లూరు నుంచి చేజర్ల మండల కేంద్రానికి రాత్రి 09:50 గంటలకు నడిచే ‘శివ ఫాస్ట్’ బస్సును వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ హామీ ఇచ్చారు.
Nellore: మంత్రి ఆనం చొరవ చేజర్ల మండల ప్రజలకు తీరనున్న బస్సు కష్టాలు!
Nellore: ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండల కేంద్రానికి రాత్రి బస్సు ను పునరుద్దించాలని మండల ప్రజలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకోని వెళ్లారు, గతంలో నెల్లూరు నుండి రాత్రి 09:50 గంటలకు నడిచే ‘శివ ఫాస్ట్’ బస్సు సర్వీస్ 5సంవత్సరాలనుండి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకోని వెళ్లారు.
వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ పనులు ముగించుకుని తమ తమ గ్రామాలకు చేరుకునేందుకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, ప్రస్తుతం రాత్రి 08:30 తర్వాత బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ఆర్థిక భారం, భద్రత సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన మంత్రి ఆనం ఆర్టీసీ అధికారులకు రిఫర్ చేశారు, రిప్రజెంటేషన్ ను చేజర్ల మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, భారత్ మహాసేన నాయకుడు జువ్విగుంట బాబు, ఎల్‌వి ప్రసాద్ నెల్లూరు రీజినల్ మేనేజర్ SK షమీమ్ కి అందజేశారు.స్పందించిన రీజినల్ మేనేజర్ SK షమీమ్, నెల్లూరు 1 డిపో మేనేజర్‌తో చర్చించి ఒక వారంలో ‘శివ ఫాస్ట్’ బస్సు సర్వీసును పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ నిర్ణయంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు, త్వరితగతిన సర్వీస్ ప్రారంభించాలని మండల ప్రజలు కోరుతున్నారు