రైతుల ముంగిట పశువైద్యం గర్భకోశ వ్యాధులకు చికిత్స పశుగ్రాసంపై శిక్షణ
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురంలో పశువర్ధక శాఖ, రాపూరు ఏఎంసి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.
రైతుల ముంగిట పశువైద్యం గర్భకోశ వ్యాధులకు చికిత్స పశుగ్రాసంపై శిక్షణ
Kaluvaya: నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో పశువర్ధక శాఖ మరియు రాపూరు ఏఎంసి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులపై చికిత్సలు అందించడంతో పాటు, ఆడ దూడల ఉత్పత్తి కోసం ఆధునిక సెమన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా పశువులకు సూటి పరీక్షలు నిర్వహించి, పోషకాహారంతో కూడిన పశుగ్రాసం పెంపకం, పశుసంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నివారణ చర్యలు వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఈ శిబిరం ద్వారా రైతులు తమ పశువుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంతో పాటు, పశుసంపద అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడి గురు జయంతి, టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణ ప్రసాద్, ఏఎంసి వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ చిన్నయ్య, పాటు గ్రామ నాయకులు,ఏఎంసి సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.