ఒకపక్క కలెక్టర్ పర్యవేక్షణ.. మరోపక్క తహశీల్దార్ కార్యాలయంలో జేసీ హడావిడి!
Naidupeta: ఈనెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేట పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నిమిషం తీరిక లేకుండా గడుపుతోంది.
ఒకపక్క కలెక్టర్ పర్యవేక్షణ.. మరోపక్క తహశీల్దార్ కార్యాలయంలో జేసీ హడావిడి!
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని ఈ నెల 30వ తేదీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటకు విచ్చేస్తుండడంతో అక్కడి ఏర్పాట్లను పరిశీలించడానికి విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు అధికారులు ఒకపక్క ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలను దగ్గరుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తుండడం జరుగుతుంటే.
మరోపక్క జాయింట్ కలెక్టర్ గోవిందరావు నాయుడుపేట తాసిల్దార్ కార్యాలయం కు హుటాహుటిన రావాడం జరిగింది, అయితే ఇంత బిజీ షెడ్యూల్ ఆయన నాయుడుపేట తాసిల్దార్ కార్యాలయముకు ఎందుకు వచ్చారు అన్న అంశం నాయుడుపేట ప్రజలలో చర్చనీయంగా మారింది. ఓ పక్క ముఖ్యమంత్రి పర్యటన మరోపక్క జాయింట్ కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయం కు హుటాహుటిన రావడం ఏంటని నాయుడుపేట ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో భాగంగా అధికారులతో చర్చించడానికి జాయింట్ కలెక్టర్ గోవిందరావు నాయుడుపేట తాసిల్దార్ కార్యాలయం వచ్చారా? లేక మరేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా? అన్నా పరిస్థితులలో నాయుడుపేట ప్రజలలో చర్చనీయంగా మారడమే కాకుండా ఇంత బిజీ పరిస్థితులలో జాయింట్ కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయం కు రావడానికి కారణాలు ఏమిటో అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.