Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది.

Update: 2026-02-11 09:29 GMT

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ ఎక్సైజ్ కోర్టు ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అంబటి రాంబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అదే సమయంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, కింది షరతులతో బెయిల్ ఇచ్చింది.

రూ. 10,000 నగదుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, అంబటి రాంబాబు రేపు (గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. గతంలో నమోదైన ఎక్సైజ్ కేసులకు సంబంధించి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Tags:    

Similar News