సాగర తీరంలో మెట్రో పరుగులు: విశాఖ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మార్క్ సక్సెస్!

Visakhapatnam Metro Project: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి నమోదైంది.

Update: 2026-02-10 11:49 GMT

Visakhapatnam Metro Project: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా కంటున్న విశాఖ మెట్రో కల సాకారం దిశగా అడుగులు పడ్డాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో రాష్ట్రానికి కావాల్సిన కీలక అనుమతులను సాధించుకుంటున్నారు.

కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టమైన హామీ

మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి స్వయంగా సీఎంకు తెలియజేశారు.

76.9 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ప్రధాన రూట్‌తో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు కనెక్టివిటీ ఉండనుంది.

ఢిల్లీలో సీఎం బిజీ బిజీ: అమరావతి, పోలవరంపై చర్చలు

సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, ఈరోజు కూడా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పారిశ్రామిక రాయితీలపై చర్చించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం ఫేజ్-2 పనులకు అవసరమైన సుమారు రూ. 32,000 కోట్ల నిధులు, సాంకేతిక అనుమతులపై నివేదిక సమర్పించారు.

Tags:    

Similar News