మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరం

మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ అన్నారు.

Update: 2025-12-27 10:12 GMT

మంగళగిరి : మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తి పరమైన సంస్థలలో "పోష్ చట్టం" అమలు అవసరం అనే అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ (Sharing of thoughts) జరిగింది.

అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, సుప్రీమ్ కోర్టు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ, భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తి స్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీలలోనూ, బార్ అసోసియేషన్ లలోను, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో పరిస్థితులు కూడా అంచనా వేయవచ్చన్నారు. చట్టాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషణ చేస్తున్నారన్నారు. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, అయినా కేసులు తక్కువ నమోదు అవుతున్నాయని అన్నారు.

స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్ లు కూడా వర్క్ ప్లేస్ గా వస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులు పెరగటం, మహిళల రక్షణ, భద్రత అంశాలపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలలో పోష్ చట్టం అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విద్యా సంస్థలలో గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి వాటి పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళమని, విద్యా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో బాగా జరుగుతుందని అన్నారు. చిన్నతనం నుండే సరైన ఆలోచన కల్పించడం వలన లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఉత్పన్నం కావని అభిప్రాయపడ్డారు. సామాజిక కళంకం (Social stigma) కలుగుతుందనే ఆలోచనతో బయటకు చెప్పకుండా ఉండటం కూడా జరుగుతుందని చెప్పారు. కుటుంబాల్లో ఆలోచన విధానం మరాలన్నారు.

సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నివారణకు సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. మహిళా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయనే నెపంతో ఆ చట్టాలను నిర్వీర్యం చేయకూడదన్నారు. 20 శాతం మహిళలు న్యాయ వ్యవస్థ లో ఉన్నారని, క్రింద స్థాయి కోర్టులలో 50 శాతం వరకు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ సిఫారసు చేసిన అంశాలతో కూడిన పత్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు అందజేశారు.

Tags:    

Similar News