విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్ల్ లు తదితర మౌలిక సదుపాయాలు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

Update: 2025-12-28 07:32 GMT

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు వారి సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్ల్ లు తదితర మౌలిక సదుపాయాలు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రితో పాటు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.యన్.మాధవ్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఏపిఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులతో మమేకమై వారితో కొద్దిసేపు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. డిజిటల్ క్లాసులు ద్వారా ప్రపంచలో జరుగుచున్నవాటిని, ఉన్నత విద్యా ప్రమాణాలు చక్కగా తెలుసు కోవచ్చునని, ప్రతి విద్యార్థి హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తీరప్రాంత యువతీ, యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని అన్నారు. తీర ప్రాంతానికి ఏమి కావాలన్నా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని, మీరు బాగా చదవాలి, అభివృద్ధి, సంక్షేమం మేము చూసుకుంటామని అన్నారు. చదువుతోపాటు క్రీడల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది విద్య, క్రీడలుతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పారు. దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత యువతదేనని అన్నారు.

Tags:    

Similar News