ఎల్‌జీ పరిశ్రమతో సంబంధం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన దక్షిణ కొరియా దేశీయులు

Update: 2020-06-23 05:14 GMT

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ఎనిమిది మంది విదేశీయులు హైకోర్టును ఆశ్రయించారు. దక్షిణ కొరియా నుండి వచ్చిన సాంకేతిన నిపుణుల బృందానికి గ్యాస్ లీకేజీ ఘటనలో విచారణ పేరుతో విదేశానికి వెల్లకుండా ఆపేశారు. దీంతో విదేశీయులు హైకర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కాగా విదేశీయుల పిటిషన్ పై సీజే జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో విదేశీయుల తరుపు న్యాయవాదులు వీరికీ కంపెనీకి సంబంధం లేదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావడం వల్ల విశాఖకు వచ్చారని తెలిపారు.

విచారణల పేరుతో వారిని విదేశాలకు వెల్లకుండా ఆపేశారని, వీరిని వెంటనే దక్షిణ కొరియాకు వెళ్లేందుకు అనుమతివ్వాలన్న న్యాయవాది కోరారు. అనంతరం ఈ విచారణలో ఏజీ శ్రీరాం మాట్లాడుతూ వివరాలు సేకరించేందుకే దక్షిణ కొరియా బృందానికి పోలీసులు నోటీసులిచ్చినట్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విషయంలో భవిష్యత్తులో వారి అవసరం ఉంటే రావాల్సి ఉంటుందని ఏజీ అన్నారు. వాదనలను విన్న ధర్మాసనం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విదేశీయులు పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్‌ వేయవచ్చని సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది.

Tags:    

Similar News