AP News: సబ్ కలెక్టర్ సంచలన తీర్పు.. తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలుశిక్ష.. ఇల్లును ఖాళీ చేసి..

AP News: సబ్ కలెక్టర్ సంచలన తీర్పు.. తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలుశిక్ష..

Update: 2023-02-22 10:53 GMT

AP News: సబ్ కలెక్టర్ సంచలన తీర్పు.. తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలుశిక్ష.. ఇల్లును ఖాళీ చేసి..

Andhra Pradesh: కనిపెంచిన తల్లిదండ్రులను వయసు మీద పడితే కంటికి రెప్పలా చూసే కొడుకుల కన్నా.. వాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నవారే మనకు ఎక్కువగా కనిపిస్తారు. ప్రతీ చోట వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసే వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అలాంటి వారికి పశ్చిమగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ సూర్యతేజ తన సంచలన తీర్పుతో హెచ్చరిక ఇచ్చారు. వృద్ధులకు కూడా చట్టాలు ఉంటాయని వాటిని అతిక్రమిస్తే శిక్షలు తప్పవని నిరూపించారు.

నరసాపురంకు చెందిన పుల్లూరి నాగమణి తన భర్త చనిపోయి కొడుకు వెంకన్న బాబుతో ఉంటున్నారు. గత కొంతకాలంగా కొడుకు, కోడలు ఇద్దరూ కలిసి ఆ వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సరిగా తిండి పెట్టకపోగా..తల్లిపైనే చేయి చేసుకున్నాడు. కొడుకుతో పాటు కోడలు కూడా నాగమణిని చిత్రహింసలకు గురిచేసింది. దీనిపై గతేడాది జూన్‌లో సబ్‌కలెక్టర్‌ను ఆశ్రయించింది నాగమణి.

నాగమణి ఫిర్యాదు తీసుకున్న సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ ఆమె కొడుకు, కోడలును పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారు పద్ధతి మార్చుకోకపోవడంతో తన పరిధిలో ఉన్న ట్రిబ్యునల్ కోర్టులో విచారణ చేపట్టారు. తల్లిని హింసకు గురిచేయడం వాస్తవం అని నిర్ధారణ కావడంతో సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాలో తనకున్న అధికారాలను వినియోగించారు సబ్‌ కలెక్టర్‌. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకు, కోడలుకు రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు. జైలుశిక్షతో పాటు వారు ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి, అందులో నాగమణి నివాసం ఉండే విధంగా అందులో పోర్షన్ అద్దెకిచ్చి, వచ్చే అద్దెతో ఆమె జీవనం సాగించేలా తీర్పు చెప్పారు. సబ్ కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై బాధితురాలు నాగమణి సంతృప్తిని వ్యక్తం చేసింది.

Tags:    

Similar News