రాజధాని గ్రామాల రైతులకు టీడీపీ సంఘీభావం
*రాజధాని రైతులను సిఎం జగన్ రోడ్డుపై నిలబెట్టారు *రైతులను రెచ్చగోట్టే ప్రకటనలు చేస్తున్నారు
గుంటూరు జిల్లాఉద్దండరాయునిపాలెంలో రాజధాని గ్రామాల రైతులకు టీడీపీ సంఘీభావం తెలిపింది.రాజధాని రైతులను సిఎం జగన్ రోడ్డుపై నిలబెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.రైతులు రెచ్చగోట్టే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలని మాజీమంత్రి నక్కా అనందబాబు అన్నారు. కొందరూ మంత్రులు తెలుగు దేశం పార్టీ కావాలనే అందోళన చేేపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారని అలాంటి వార్తల్లో వాస్తవం లేదన్నారు. రైతులు స్వచ్ఛందంగా ఆందోళల చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు.