S.Rayavaram: ఇసుక చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

మండలంలోని పెనుగొల్లు వద్ద ఉన్న శాండ్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఏ బాబూజీ శనివారం రాత్రి 7 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2020-03-01 12:16 GMT
జిల్లా ఎస్పీ బాబూజీ, క్రైం ఏఎస్పీ అచ్యుతరావు, ఎస్ఐ ధనుంజయ, సిబ్బంది

ఎస్.రాయవరం: మండలంలోని పెనుగొల్లు వద్ద ఉన్న శాండ్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఏ బాబూజీ శనివారం రాత్రి 7 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుని పరిశీలించారు. ఇసుక, గంజాయి, గుట్కా, బెల్టుషాపులలో పట్టుకున్న మద్యం తదితర కేసుల గురించి సిఐ విజయకుమార్ ని అడిగి తెలుసుకున్నారు.

చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సదుపాయాలు, ఆహారం, తాగునీరు, వారి సంక్షేమం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ చెక్ పోస్ట్ నిర్వాహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఇసుక అక్రమ తరలింపు అరికట్టడంపై సమర్దవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైం ఏఎస్పీ అచ్యుతరావు, ఎస్ఐ ధనుంజయ, సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News