Andhra Pradesh: సహకార సంఘాల్లో రైతు భరోసా కేంద్రాలు
ప్రభుత్వం ప్రారంభించబోయే రైతు భరోసా కేంద్రాలను సహకార సంఘాల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు.
కడప : ప్రభుత్వం ప్రారంభించబోయే రైతు భరోసా కేంద్రాలను సహకార సంఘాల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. రైతుకి ఇచ్చే ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు, విత్తనాలు నిల్వచేసేందుకు గోదాములు ఉన్న సంఘాలను గుర్తించి నివేదికను జిల్లా సహకార శాఖ అధికారి కి పంపారు. ఈ నివేదికను పరిశీలించి ఆయా సంఘాలకు డీసీఓ సుభాషిని ఆదేశాలను జారీ చేశారు.
కలసపాడు మండలం లో కొత్తకోట సంఘం పరిధిలోని శంఖవరం గ్రామములో గోదాము ఏర్పాటుకు ఎంపిక చేశారు. వీరబల్లి మండల కేంద్ర సంఘం, పెద్ద వీడు సంఘం, సిద్ధవటం సంఘం, సంబేపల్లి మండలం లోని గుని గుంట, పొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి, పులివెందుల మండలం లోని ఎర్రబల్లి, అట్లూరు, కొండూరు మండల కేంద్రాల్లో సంఘాలను ఎంపిక చేశారు. ఇక్కడ సాగు అవసరం నిల్వలు పెట్టుకొని రైతులకు సరఫరా చేసేందుకు అనువుగా ఉంటుందని అంచనా వేశారు. అనుమతి తీసుకొని ఇక్కడ మరోసారి కేంద్రాలు ఏర్పాటు చేసే కాశం ఉంది.