కడప అడవుల్లో అరుదైన జంతువులు.!

Update: 2019-12-09 04:25 GMT

ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని అందించే నల్లమల, శేషాచలం, లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో దాదాపుగా1000కి పైగా వివిధ రకాల జంతు జాతులు సంచరిస్తున్నాయి. ఎన్నోవేల రకాల ఔషద మొక్కలు కూడా ఈ అడవుల్లో ఉన్నాయి. దీంతో కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ జంతువులను వేటాడకూడదని, వృక్షాలను నరికేయొద్దని అలా కాకుండా వన్యప్రాణులను వేటాడినా, అడవులను నరికినా కఠిన చర్యలు తప్పవని ప్రజను హెచ్చరించారు.

సుమారు 4.31 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా దేశంలో గుర్తింపు పొందిన పాంగోలిన్‌ (ఆలువ), హానిబడ్గర్‌ లాంటి అరుదైన జంతువులు కూడా సంచరిస్తున్నాయన్నారు. ఈ జంతువులకు సంబంధించిన ఆనవాలను అటవీ శాఖ వారు అమర్చిన సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉన్నాయన్నారు.

వాటితోపాటు చిన్నా పెద్దా, సాధు, క్రూర జంతువులు అన్ని కలుపుకుని మొత్తం 1000 రకాల జంతువులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా సీసీకెమెరాల పుటేజ్ లో పులి, చిరుతలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, కొండగొర్రెలు, రొచ్చు కుక్కలు, నక్కలు, తోడేలు, అడవి దున్నలు, కుందేళ్లు, నెమళ్లు, కంతులు లాంటి జంతువులు అభయారణ్యంలో సంచరిస్తూ కనిపిస్తున్నాయన్నారు.

గత సంవత్సరం 2018 జనవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా అటవీ జంతు గణన కార్యక్రమాన్ని చేపట్టారని. ఇందులో భాగంగా అటవీ అధికారులు అడవినంతా గాలించారు. ప్రతి చెట్టు, పుట్ట పరిశీలించారు. అడలి ప్రాంతంలో ఎన్ని వేల రకాల చెట్లు ఉన్నాయో లెక్కలు కట్టారన్నారు. కొన్ని విచిత్ర ఆకారాలతో ఉన్న జంతువులను కూడా వారు గుర్తించారని తెలిపారు. ఇన్ని అరుదైన జంతువులు ఈ అడవుల్లో ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా జిల్లాలోని అడవుల ప్రాధాన్యత దేశమంతా సంతరించుకుంటుదని తెలిపారు.


Delete Edit




Tags:    

Similar News