G.Madugula: గిరిజన ప్రాంతంలో పోలీస్ శాఖ సేవలు సంతోషకరం

మండలంలోని నుర్మాతీ పోలీస్ అవుట్ పోస్ట్ ను విశాఖ రేంజ్ డిఐజి కె.ఎల్.వి.రంగారావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

Update: 2020-03-05 10:52 GMT

జి.మాడుగుల: మండలంలోని నుర్మాతీ పోలీస్ అవుట్ పోస్ట్ ను విశాఖ రేంజ్ డిఐజి కె.ఎల్.వి.రంగారావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ శాఖ ద్వారా గిరిజనులకు అందిస్తున్న సేవలపై ఆయన సిబ్బందిని కొనియాడారు. మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులకు ఉచితంగా బస్సు సౌకర్యము, ఉచిత వైద్య శిబిరాలు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం సంతోషకరమని ఆయన అన్నారు.

గిరిజన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే పలు కార్యక్రమాలు సిల్క్ డెవలప్మెంట్ ప్రేరణ స్ఫూర్తి వంటి కార్యక్రమాల ద్వారా కంటి చూపు మందగించిన వారికి కంటి ఆపరేషన్లు కళ్ళద్దాలు పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేసిన సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈయన వెంట జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ. ఓఎస్డీ కృష్ణారావు 198 బెటాలియన్ అశోక్, ఎస్సై ఉపేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News