Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Droupadi Murmu: రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఏవీ ధర్మారెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మొదట ఆమె ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీ భూవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఆలయ ఆవరణలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ముర్ము మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. రేపు ద్రౌపది ముర్ము ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు.