పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత.. జైలు నుండి ఆస్పత్రికి తరలింపు

Update: 2025-03-01 10:46 GMT

పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత.. జైలు నుండి ఆస్పత్రికి తరలింపు

Posani Krishna murali's health condition: పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌ను, నారా లోకేష్‌ను దూషించిన ఘటనలకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులోనే ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగా కోర్టు 14 రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. జైలులో ఉండగానే శనివారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన జైలు సిబ్బందికి చెప్పారు. దాంతో వెంటనే పోలీసులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 

నేరాన్ని అంగీకరించిన పోసాని

గురువారం రాత్రి పోసాని కృష్ణమురళిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆ సమయంలో ఓబులవారిపల్లె పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో ఆయన నేరాన్ని అంగీకరించినట్లుగా ఉన్న పత్రాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. "వైసీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే చదివాను. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ వైరల్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా వైఎస్ జగన్‌కు మేలు చేసేందుకే ఇలా చేశాను" అని పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరించినట్లుగా ఉందని తెలుస్తోంది.

Also read this: AP Politics: ఏపీ పోలీసుల నెక్ట్స్ లిస్టులో గోరంట్ల మాధవ్?   

Tags:    

Similar News