AP Politics: ఏపీ పోలీసుల నెక్ట్స్ లిస్టులో గోరంట్ల మాధవ్?

Gorantla Madhav gets notice from Vijayawada police, Gorantla Madhav arrest news buzz
x

Vijayawada Police reaches Gorantla Madhav's residence: ఏపీ పోలీసుల నెక్ట్స్ లిస్టులో గోరంట్ల మాధవ్?

Highlights

Who is next to be arrested person in the Red book list? గోరంట్ల మాధవ్‌ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తారా?

Who is next to be arrested person in the Red book list?: గోరంట్ల మాధవ్ మరోసారి వార్తల్లోకొచ్చారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో వాసిరెడ్డి పద్మ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయంలో గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కొద్దిసేపటి క్రితం అనంతపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు నోటీసులు అందించారు.

అయితే, ఆయనకు నోటీసులు ఇచ్చి వెను తిరుగుతారా లేక అదుపులోకి తీసుకుంటారా అనేదే ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది. ఈ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంకొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు.

నిన్న బుధవారం రాత్రి పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఆయన్ను అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలను దూషించారనేది వారిపై ఆరోపణలు ఉన్నాయి.

రాంగోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి, దళిత యువకుడి కిడ్నాప్ వంటి ఆరోపణలతో ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

గోదాంలో ఉన్న రేషన్ బియ్యం మాయమయ్యాయనే ఆరోపణల కింద మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్య కేసు విచారణ ఎదుర్కొంటున్నారు.

రెడ్ బుక్‌లో గోరంట్ల మాధవ్ పేరు?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అప్పట్లో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే... సదరు వైసీపీ నేతలు, వారి మాటలు విని టీడీపీ నేతలను, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే నారా లోకేష్ ప్రకటించారు. అలాంటి వారి పేర్లన్నీ ఈ రెడ్ బుక్‌లో రాసుకుంటున్నానని అన్నారు.

నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలను రాంగోపాల్ వర్మ ప్రస్తావిస్తూ ఎర్రబుక్కు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా టీడీపీ ఆగ్రహానికి కారణమయ్యాయి.

ఆర్జీవీ కామెంట్స్ సంగతి కాసేపు అలా పక్కనపెడితే, వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత కూడా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రెడ్ బుక్ కామెంట్స్‌ను మరోసారి గుర్తుచేశారు. ఇవన్నీ చూస్తోంటే ఇక గోరంట్ల మాధవ్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Watch this video also : Maha kumbh Mela: ముగిసిన మహా వేడుక..పెట్టిన ఖర్చు ఎంత వచ్చిన ఆదాయం ఎంత? | Trending స్టోరీ

Show Full Article
Print Article
Next Story
More Stories