ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు : పవన్ కళ్యాణ్

Update: 2019-12-14 13:19 GMT

కొద్ది రోజుల నుంచి జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీ మారనున్నారని ప్రచారాలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే కోణంలో ఆయనకి పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, ఆయన్ని పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు షోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో రాపాక వరప్రసాదరావు వ్యవహారం అయోమయంలో మునిగిపోయింది.

ఈ విషయాలపై స్పందించిన పవన్ కాళ్యాణ్ వరప్రసాద్ కు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని వాటిని కొట్టి పారేసాడు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పటి వరకూ కొనసాగిన ప్రచారాలకు పుల్‌స్టాప్‌ పడిపోయిందని అందరూ భావించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రాపాక ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ జనసేన పార్టీలో చాలావరకు మార్పులు రావాలని, ఈ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ అంకిత భావం కలిగి ఉండాలని తెలిపారు. పార్టీ ప్రముఖులు కీలక నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోతే పార్టీ ప్రజల్లో ముందుకెళ్లదని తెలిపారు.

ప్రజల కోసం పనిచేయాలని.. తన భవిష్యత్ కోసం కూడా తాను ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక పార్టీతో కొంత కాలంగా గ్యాప్ వచ్చిందని రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా చెప్పారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరడం కష్టమైన పనికాదని, అది సాధారణ విషయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రచారమైన విషయాల్లో వాస్తవం లేదని వైఎస్సార్‌సీపీతో తనకు సంబంధాలు ఉన్నాయనడం అవాస్తవమని అన్నారు. ఇక వరప్రసాదరావు చేసిన ఈ వ్యాఖ్యలపై అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.




Tags:    

Similar News